Share News

అన్ని మండలాల్లో రెవెన్యూ క్లినిక్‌లు

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:47 AM

రెవెన్యూ క్లినిక్‌లు అన్ని మండలాల్లో జరిపి భూసమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోలను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

అన్ని మండలాల్లో రెవెన్యూ క్లినిక్‌లు

ఆర్డీవోలకు కలెక్టర్‌ ఆదేశం

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 27(ఆంరఽధజ్యోతి): రెవెన్యూ క్లినిక్‌లు అన్ని మండలాల్లో జరిపి భూసమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోలను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రీసర్వే, పీజీఆర్‌ఎస్‌, మ్యుటేషన్‌ తదితర అంశాలపై సంబంధిత అఽధికారులతో కలిసి వర్చువల్‌ విధానంలో ఆర్డీవోలు, తహసీల్దారు, సర్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా ఫిర్యాదులు వస్తున్న భూసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జరుగుతున్న రీసర్వే ప్రక్రియను తప్పులు లేకుండా చేయాలన్నారు. ఈకేవైసీ, డిజిటల్‌ సైన్‌, మ్యుటేషన్‌ ఆలస్యంగా జరుగుతోందని, వాటిని పూర్తిచేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల విషయంలో సంబంధిత అధికారులు అర్జీదారులకు ఫోన్‌ చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా చూడాలని తెలిపారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సందర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

హైవే, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి

జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణపనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై సంబంఽధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీసిటీకి సంబంధించిన జాతీయ రహదారి అనుసంధానం అప్రోచ్‌ వంతెనకు సం బంధించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఎల్జీ కంపెనీ పేజ్‌ 1, 2కు సంబంధించి భూసేకరణ, నీటి వనరుల పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు విజయభరత్‌ రెడ్డి, శ్రీసిటీ జీఎం భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 01:47 AM