రైలు బోగీలో రెస్టారెంట్
ABN , Publish Date - Oct 19 , 2026 | 02:19 AM
భోజనప్రియులను, చిన్నారులను ఆకట్టుకునేలా తిరుచానూరు రైల్వేస్టేషనులో ఓ రైలు బోగీని రెస్టారెంటుగా మార్చేపనులు ప్రారంభమయ్యాయి.
రేణిగుంట, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): భోజనప్రియులను, చిన్నారులను ఆకట్టుకునేలా తిరుచానూరు రైల్వేస్టేషనులో ఓ రైలు బోగీని రెస్టారెంటుగా మార్చేపనులు ప్రారంభమయ్యాయి. రేణిగుంట -తిరుపతి ప్రధాన మార్గంలో సీఆర్ఎస్ ఎదురుగా కొత్తగా నిర్మించిన తిరుచానూరు రైల్వేస్టేషనులో మధ్యప్రదేశ్కు చెందిన వ్యాపారి రేణిగుంట సీఆర్ఎస్ నుంచి ఓ రైలు బోగీని కొనుగోలు చేశారు. దాన్నే రెస్టారెంటుగా మారుస్తున్నారు.