Share News

కాణిపాకం ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడి రాజీనామా.. ఆమోదం

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:57 AM

కాణిపాక వినాయకస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యుడు కె.చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

కాణిపాకం ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడి రాజీనామా.. ఆమోదం
చంద్రశేఖర్‌రెడ్డి

ఐరాల (కాణిపాకం), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వినాయకస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యుడు కె.చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. గతేడాది నవంబరు 24న నూతన పాలకవర్గం ఏర్పాటైన సంగతి తెలిసిందే. వీరి కాలపరిమితి వచ్చే ఏడాది నవంబరు వరకూ ఉంది. అయితే ట్రస్టుబోర్డులో సభ్యుడైన కె.చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల జరిగిన ‘పరిషత్తు’ ఎన్నికల్లో ఐరాల ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవమయ్యారు. ఏకకాలంలో రెండు పదవులు చేపట్టకూడదన్న కారణంతో ఆయన బోర్డు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. దీనిపై గత నెల 26న రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి లేఖ రాసి చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామాను ఆమోదించాల్సిందిగా అభ్యర్థించారు. దానికనుగుణంగా ప్రభుత్వం ట్రస్టుబోర్డు సభ్యుడి రాజీనామాను ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి కె.కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Nov 14 , 2026 | 01:57 AM