బయో అకౌస్టిక్స్‌పై పరిశోధనలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:37 AM
ఏర్పేడు మండలంలోని జంగాలపల్లి వద్ద ఉన్న తిరుపతి ఐసర్‌లో వారం రోజులపాటు నిర్వహించిన అడ్వాన్స్‌డ్ అకౌస్టిక్స్ వర్క్‌షా్‌పఆదివారంతో ముగిసింది. న్యూయార్క్‌కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయం కె లిసా యాంగ్ సెంటర్ ఫర్ కన్జర్వేషన్ బయో అకౌస్టిక్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జంతు, మానవుల ధ్వనులు, అధ్యాయనాల గురించి పరిశోధకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
ఏర్పేడు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఏర్పేడు మండలంలోని జంగాలపల్లి వద్ద ఉన్న తిరుపతి ఐసర్‌లో వారం రోజులపాటు నిర్వహించిన అడ్వాన్స్‌డ్ అకౌస్టిక్స్ వర్క్‌షా్‌పఆదివారంతో ముగిసింది. న్యూయార్క్‌కు చెందిన కార్నెల్ విశ్వవిద్యాలయం కె లిసా యాంగ్ సెంటర్ ఫర్ కన్జర్వేషన్ బయో అకౌస్టిక్స్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో జంతు, మానవుల ధ్వనులు, అధ్యాయనాల గురించి పరిశోధకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఇందులో భాగంగా చివరి రోజున రేణిగుంట మండలం మామండూరు అటవీక్షేత్రాన్ని పర్యటించి.. అక్కడ వృక్షాలపై ఉన్న జంతుజాతుల ధ్వనులపై అధ్యయనం చేశారు.
అధునాతన శాస్త్రీయ పరికరాలపై శిక్షణ
ఐసర్ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అధునాతన శాస్త్రీయ పరికరాల వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరిశోధన రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సద్వినియోగం చేసుకోవచ్చు. మార్చి ఒకటో తేదీవరకు రిజిస్ట్రేషన్లు అవకాశమిచ్చారు.