గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు షురూ
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:02 AM
తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పరేడ్ నిర్వహణకు అవసరమైన మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. గ్రౌండ్ అంతటా పరేడ్ లైన్లు, కవాతు మార్గాలను స్పష్టంగా గుర్తించే విధంగా మార్కింగ్ చేస్తున్నారు. శనివారం పోలీసుల కవాతుకు రిహార్సల్స్ నిర్వహించారు.ప్రధాన వేదిక సిద్ధమవుతుండగా అతిధులు కూర్చోవడానికి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటుచేశారు. శాఖల వారీగా అభివృద్ధిని తెలియజేసేలా శకటాలు సిద్ధమవుతున్నాయి. డీఆర్డీఏ, మెప్మా, సెర్ప్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు సుమారు 280మందికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్,విమానాశ్రయం సహా ముఖ్యమైన ప్రభుత కార్యాలయాలు జాతీయ పతాక రంగుల్లో విద్యుత్‌కాంతులు వెదజల్లుతున్నాయి.
తిరుపతి(కలెక్టరేట్/నేరవిభాగం)/రేణిగుంట , జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పరేడ్ నిర్వహణకు అవసరమైన మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. గ్రౌండ్ అంతటా పరేడ్ లైన్లు, కవాతు మార్గాలను స్పష్టంగా గుర్తించే విధంగా మార్కింగ్ చేస్తున్నారు. శనివారం పోలీసుల కవాతుకు రిహార్సల్స్ నిర్వహించారు.ప్రధాన వేదిక సిద్ధమవుతుండగా అతిధులు కూర్చోవడానికి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటుచేశారు. శాఖల వారీగా అభివృద్ధిని తెలియజేసేలా శకటాలు సిద్ధమవుతున్నాయి. డీఆర్డీఏ, మెప్మా, సెర్ప్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు సుమారు 280మందికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్,విమానాశ్రయం సహా ముఖ్యమైన ప్రభుత కార్యాలయాలు జాతీయ పతాక రంగుల్లో విద్యుత్‌కాంతులు వెదజల్లుతున్నాయి.