Share News

గర్భిణి మృతిపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - May 21 , 2026 | 01:55 AM

మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గతంలో గైనకాలజి్‌స్టగా పనిచేసిన డాక్టర్‌ జి.అనురాధపై విచారణకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

గర్భిణి మృతిపై నివేదిక ఇవ్వండి

12 ఏళ్ల తర్వాత విచారణకు ప్రభుత్వం ఆదేశం

మదనపల్లె క్రైం, మే 20(ఆంధ్రజ్యోతి) : మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గతంలో గైనకాలజి్‌స్టగా పనిచేసిన డాక్టర్‌ జి.అనురాధపై విచారణకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూలై 28న డాక్టర్‌ అనురాధ విధుల్లో ఉండగా రెడ్డెమ్మ అనే గర్భిణి ప్రసవం కోసం వచ్చి మృతిచెందింది. రెడ్డెమ్మ కుటుంబీకులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 12ఏళ్ల తర్వాత ఆ ఘటనపై విచారించేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు శ్రీవాణిని విచారణాధికారిగా నియమించగా ఆమె నిరాకరించారు. దీంతో గుంటూరు జిల్లా నరసారావుపేట ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు ప్రసూనను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నెలలోపు విచారణ జరిపి నివేదికలు అందజేయాలంటూ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్‌ అనురాధ ప్రస్తుతం సదుం సీహెచ్‌సీ వైద్యాధికారిణిగా పనిచేస్తున్నారు.

Updated Date - May 21 , 2026 | 01:55 AM