Share News

టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులకు మోక్షం

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:39 AM

టీటీడీ ఈహెచ్‌ఎ్‌స పథకంలో ఏర్పడిన నిధుల కొరతను పరిష్కరించి ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. 2022 నుంచి 2026 ఏప్రిల్‌ నాటికి స్విమ్స్‌, బర్డ్‌, ఇతర ఆస్పత్రులకు వైద్య ఖర్చుల బిల్లులు చెల్లించడానికి సిద్ధమయ్యారు. గరిష్ఠ పరిమితి రూ.3లక్షల కంటే ఎక్కువగా ఖర్చయిన కొన్ని వైద్య కేసుల్లో ఉద్యోగి/పింఛనుదారులు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రులకు రూ.17.80 కోట్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.13.90 కోట్లను కలిపి మొత్తం రూ.31.7 కోట్లను చెల్లించడానికి టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయం వారికి ఉపశమనం కలిగిస్తోంది.

టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులకు మోక్షం

పరిమితికి మించి పెట్టుకున్న రూ.13.90 కోట్ల విడుదల

స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రులకు రూ.17.80 కోట్ల చెల్లింపులు

తిరుపతి(టీటీడీ), జూలై 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఈహెచ్‌ఎ్‌స పథకంలో ఏర్పడిన నిధుల కొరతను పరిష్కరించి ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. 2022 నుంచి 2026 ఏప్రిల్‌ నాటికి స్విమ్స్‌, బర్డ్‌, ఇతర ఆస్పత్రులకు వైద్య ఖర్చుల బిల్లులు చెల్లించడానికి సిద్ధమయ్యారు. గరిష్ఠ పరిమితి రూ.3లక్షల కంటే ఎక్కువగా ఖర్చయిన కొన్ని వైద్య కేసుల్లో ఉద్యోగి/పింఛనుదారులు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రులకు రూ.17.80 కోట్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.13.90 కోట్లను కలిపి మొత్తం రూ.31.7 కోట్లను చెల్లించడానికి టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయం వారికి ఉపశమనం కలిగిస్తోంది.

టీటీడీ ఈహెచ్‌ఎ్‌ఫ పరిమితి పెంచాలి

టీటీడీ ఈహెచ్‌ఎ్‌ఫ పరిమితిని పెంచాలని ఉద్యోగులు, పింఛనుదారులు కోరుతున్నారు.ఈ పథకాన్ని టీటీడీ, ఉద్యోగుల ఉమ్మడి విరాళంతో (65ః35 నిష్పత్తిలో) రూ.25 కోట్ల ప్రాథమిక నిధితో 2022 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక వ్యక్తికి ఒక విడత చికిత్సకు గరిష్ఠంగా రూ.3లక్షలు మాత్రమే బోర్డు చెల్లిస్తోంది. ఈ మొత్తం చాలా కేసుల్లో వైద్య ఖర్చులకు సరిపోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ ఈహెచ్‌ఎ్‌ఫ పరిధిని మరింత విస్తరిస్తూ వైద్య ఖర్చుల చెల్లింపుల నియమాలను సవరిస్తూ 2025 అక్టోబరులో బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులతోపాటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద నమోదై ఉండి టీటీడీ పథకంలో చేరేందుకు సుముఖంగా ఉన్న ఆస్పత్రులను సైతం ఈహెచ్‌ఎ్‌ఫలో చేర్చుకునేందుకు బోర్డు నిర్ణయించింది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు కింద నమోదైన ఆస్పత్రులకు టీటీడీ చేసే చెల్లింపుల కోసం రెండు రకాల ధరలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇందులో ఏపీ ప్రభుత్వ ఈహెచ్‌ఎ్‌స టారిఫ్‌ ప్యాకేజీ, స్విమ్స్‌ ఆస్పత్రి టారిఫ్‌ ధరలు. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దాని ప్రకారమే ఆయా ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేయాలని బోర్డు తీర్మానించింది.

ఇవీ కొత్త నిర్ణయాలు..

ఫ యాజమాన్యం అందించే ప్రాథమిక విరాళాన్ని ఏడాదికి రూ.25 కోట్లు ఖరారు చేశారు. ఈ మొత్తం కూడా ఈహెచ్‌ఎ్‌ఫ రాకముందు జరిగిన సగటు వైద్య ఖర్చులకు సమానం. ఈ మొత్తాన్ని ఉద్యోగుల సంక్షేమ బడ్జెట్‌/పెన్షన్‌ బడ్జెట్‌ ఖాతాల నుంచి డ్రా చేస్తారు. ఉద్యోగులు/పింఛనుదారులు ప్రస్తుతం చెల్లిస్తున్న పాత ధర ప్రకారమే తమ నెలవారీ విరాళాన్ని కొనసాగిస్తారు.

ఫ రెఫరల్‌/కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స వల్ల జరిగే వైద్య ఖర్చు రూ.25 కోట్లు దాటితే ఆ అదనపు ఖర్చును టీటీడీ యాజమాన్యం, ఉద్యోగులు/పింఛనుదారులు ప్రస్తుతం ఉన్న 65ః35 నిష్పత్తిలో పంచుకుంటారు.

ఫ ఈ పథకం ఆర్థిక స్థిరత్వం, క్లెయిమ్‌ల వివరాల ఆధారంగా నిధుల పరిమితిని, విరాళాల నిర్మాణాన్ని ఏటా సమీక్షిస్తారు. ఒక విడత వైద్య ఖర్చు రూ. 3 లక్షల నుంచి రూ.5లక్షల్లోపు ఉన్నప్పుడు ఆ అదనపు మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ చేసే అధికారాన్ని ఈవోకి కల్పించారు.వైద్య ఖర్చులు రూ.5 లక్షలు దాటిన కేసులను నేరుగా టీటీడీ బోర్డు ముందుంచుతారు. ఈ అదనపు ఖర్చులను సందర్భాన్ని అనుసరించి సంక్షేమ బడ్జెట్‌/పెన్షన్‌ బడ్జెట్‌ నుంచి భరిస్తారు.

ఫ స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రులకు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.17.80 కోట్ల బిల్లులను సంక్షేమ బడ్జెట్‌/పెన్షన్‌ బడ్జెట్‌ నుంచి చెల్లిస్తారు.

ఫ రూ.3 లక్షల పరిమితి దాటిన సుమారు రూ.13.90 కోట్ల పెండింగ్‌ క్లెయిమ్‌లను ఒకేసారి తీసుకునే ప్రత్యేక చర్యగా సంక్షేమ/పెన్షన్‌ బడ్జెట్‌ నుంచి రీయింబర్స్‌మెంట్‌.. అత్యవసర పరిస్థితుల కారణంగా టీటీడీ ప్యానెల్‌లో లేని ఆస్పత్రుల్లో వైద్య చికిత్స చేయించుకున్న ఖర్చులను సైతం ఈ పథకం నియమ నిబంధనలకు అనుసరించి ప్రత్యేక చర్యగా రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు.

Updated Date - Jul 12 , 2026 | 01:39 AM