Share News

రేషన్‌ కార్డుదారులకు ఊరట

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:55 AM

రేషన్‌ షాపుల్లో బియ్యం, పంచదార, గోధుమపిండి, పామోలిన్‌ ఆయిల్‌ను కార్డుదారులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రేషన్‌ కార్డుదారులకు ఊరట

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ షాపుల్లో బియ్యం, పంచదార, గోధుమపిండి, పామోలిన్‌ ఆయిల్‌ను కార్డుదారులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొన్నాళ్లు బియ్యం, పంచదారతో పాటు కందిపప్పును రాయితీపై అందజేసింది. ఆ తర్వాత కందిపప్పును నిలిపేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు మేలు చేసేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.160 కు పైగా పలుకుతోంది. గతంలో రేషన్‌ దుకాణాల్లో రూ.67కి అందించేవారు. తాజాగా కిలో కందిపప్పు రూ.100, గోధుమపిండి రూ.25, లీటర్‌ పామోలిన్‌ ఆయిల్‌ రూ.125 చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో 1220 చౌక దుకాణాల ద్వారా 4.80 లక్షల కార్డుదారులకు మేలు జరగనుంది.

Updated Date - Nov 14 , 2026 | 01:55 AM