సంద్రంలోకి తాబేలు పిల్లల విడుదల
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:51 AM
శ్రీహరికోట తీరానికి సమీపంలో నవాబుపేట వద్ద మంగళవారం ఆలివ్ రిడ్డీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. తిరుపతి అటవీ సంరక్షణ అధికారి సి.సెల్వం, సూళ్లూరుపేట డీఎ్‌ఫవో హారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అలీవ్ రిడ్డీ సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
సూళ్లూరుపేట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీహరికోట తీరానికి సమీపంలో నవాబుపేట వద్ద మంగళవారం ఆలివ్ రిడ్డీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. తిరుపతి అటవీ సంరక్షణ అధికారి సి.సెల్వం, సూళ్లూరుపేట డీఎ్‌ఫవో హారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అలీవ్ రిడ్డీ సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.శ్రీనివాసపురం, వైట్‌కుప్పం, పూడికుప్పం, నవాబుపేట, కొండూరుపాలెం ప్రాంతాల్లో మొత్తం 5 సముద్ర తాబేళ్ల రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ తాబేళ్లు తీర ప్రాంతాల్లో పెట్టే గుడ్లను సేకరించి రక్షణ కేంద్రాల్లో కృత్రిమంగా పొదిగించి సముద్రంలో పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు.షార్ కంట్రోలర్ రమేష్ బాబు, ఫారెస్ట్ అధికారి అమితన్ మొహంతి, పులికాట్ రేంజర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.