రిజిస్ట్రేషన్ల రాబడి రూ.1.48 లక్షలే
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:03 AM
రిజిస్ట్రేషన్ సేవాకేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె మంగళవారం రెండోరోజుకు చేరింది. దీని ప్రభావం రిజిస్ట్రేషన్ల రాబడిపై పడింది. తొలి రోజైన సోమవారం రూ.4.71 లక్షల ఆదాయం రాగా, మంగళవారం రూ.1,48,100 మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరింది.
డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్‌తో బోసిపోయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
చిత్తూరు కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ సేవాకేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె మంగళవారం రెండోరోజుకు చేరింది. దీని ప్రభావం రిజిస్ట్రేషన్ల రాబడిపై పడింది. తొలి రోజైన సోమవారం రూ.4.71 లక్షల ఆదాయం రాగా, మంగళవారం రూ.1,48,100 మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరింది. సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల వారీగా.. చిత్తూరు రూరల్ రూ.57,500, నగరిలో రూ.41,000, చిత్తూరు ఆర్వో ద్వారా రూ.30,000, బంగారుపాళ్యంలో రూ.18,900, కుప్పంలో రూ.700 మాత్రమే వచ్చింది. కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు ఎస్‌ఆర్‌లలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. పెన్‌డౌన్ సమ్మె వివరాలు తెలియడంతో కక్షిదారులు ఎవరూ రాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే చిత్తూరు ఆర్వో కార్యాలయం ఈసీలు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా పనుల కోసం వచ్చిన ఐదుగురు తప్పితే.. ఇంకెవరూ రాలేదు. కాగా, చిత్తూరు నగరం గిరింపేటలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. డాక్యుమెంట్ తయారీని ఆర్‌ఎ్‌సకేలకు అప్పగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు.