Share News

అకోబర్‌ 26న శ్రీసిటీలో రీజనల్‌ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:43 AM

శ్రీసిటీలోని క్రియా యూనివర్శిటీ వేదికగా రీజనల్‌ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఈ సమ్మిట్‌పై ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో విశ్వ శుక్రవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో వర్చువల్‌ విధానంలో సమీక్షించారు.

అకోబర్‌ 26న శ్రీసిటీలో రీజనల్‌ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌

తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): శ్రీసిటీలోని క్రియా యూనివర్శిటీ వేదికగా రీజనల్‌ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఈ సమ్మిట్‌పై ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో విశ్వ శుక్రవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో వర్చువల్‌ విధానంలో సమీక్షించారు. ముఖ్యంగా పర్యాటకం, ఆతిధ్యం, ఎలకా్ట్రనిక్స్‌, సెమీ కండక్టర్లు, ఆటోమోటివ్‌, అంతరిక్ష రంగాలపై రీజనల్‌ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో చర్చించనున్నట్లు తెలిపారు. సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.పరిశ్రమల శాఖ జీఎం చంద్రశేఖర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజరు విజయభరత్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:43 AM