Share News

రెండు కార్లు సహా ఎర్రచందనం స్వాధీనం

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:03 AM

శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను రెండు కార్లతో సహా స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు ఫారెస్ట్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో ఏ.వేణు తెలిపారు.

రెండు కార్లు సహా ఎర్రచందనం స్వాధీనం
పట్టుబడిన కార్లు, దుంగలతో ఫారెస్ట్‌ అధికారులు

పీలేరు రూరల్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను రెండు కార్లతో సహా స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు ఫారెస్ట్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో ఏ.వేణు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. రహస్య సమాచారం అందడంతో పీలేరు-చిత్తూరు జాతీయ రహదారి మార్గంలోని ఎర్రగుంటపల్లె క్రాస్‌, కల్లూరు ఘాట్‌ రోడ్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. వారిని చూసి ఎర్ర గుంటపల్లె క్రాస్‌ వద్ద ఓ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి డ్రైవర్‌ పారిపోయాడు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా డ్రైవర్‌ సీటు వెనుకాల అమర్చిన ఐదు ఎర్రచందనం దుంగలు కనిపించాయి. అలాగే పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్‌ రోడ్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనాన్ని డ్రైవర్‌ రోడ్డు పక్కన ఆపి పారిపోయాడు. అందులో ఐదు ఎర్రచందనం దుంగలు కనిపించాయి. కార్లతో సహా వాటిని స్వాధీనం చేసుకుని పీలేరు ఫారెస్టు కార్యాలయానికి తరలించారు. కార్లతో కలిపి వాటి విలువ రూ.10లక్షలు ఉంటుందని డీఎ్‌ఫవో తెలిపారు. పారిపోయిన వారు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా గుర్తించామన్నారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్‌వో ఎస్‌. చంద్రశేఖర్‌, ఎఫ్‌ఎ్‌సవో ప్రతా్‌పకుమార్‌, ఎఫ్‌బీవోలు పి.రెడ్డిప్రసాద్‌, కె.ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 01:03 AM