మూడుసార్లు రీకౌంటింగ్
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:19 AM
ఏర్పేడు మండలంలోని ఎండీపుత్తూరు సర్పంచ్‌గా చంద్రమ్మ ఐదు ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. దీనిపై పోటీదారు కృపా చంద్రిక రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు.
ఏర్పేడు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏర్పేడు మండలంలోని ఎండీపుత్తూరు సర్పంచ్‌గా చంద్రమ్మ ఐదు ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. దీనిపై పోటీదారు కృపా చంద్రిక రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. అధికారులు ఒప్పుకోక పోవడంతో కౌంటింగ్ కేంద్రం ఎదుట గురువారం రాత్రి ధర్నాకు దిగారు. దీంతో అధికారులు మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా మెజారిటీ ఐదు ఓట్లే రావడంతో చంద్రమ్మను విజేతగా ప్రకటించారు.