సీజన్ చివర్లో.. రికార్డుస్థాయి మామిడి ధరలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 01:45 AM
టన్ను నీలం రూ.1.3 లక్షలు తోతాపురి రూ.1.17 లక్షలు
బంగారుపాళ్యం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): సీజన్ చివర్లో మామిడి కాయల ధరలు రికార్డుస్థాయిలో పలికాయి. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో సోమవారం నీలం, తోతాపురి కాయలను వేలం పాటలో పలు రాష్ట్రాల వ్యాపారులు పోటాపోటీగా పాడుకున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు మండీ నెంబరు 88లో జరిగిన వేలం పాటలో నీలం రకం టన్ను రూ.95 వేల నుంచి రూ.1.30 వేల వరకు ధర పలికింది. ఈ రకం కాయలను బెంగళూరుకు చెందిన గణేష్ రూ.1.3 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. అదే విఽధంగా మండీ నెంబరు 18 (ముజీబ్ ట్రేడర్స్)లో నాణ్యమైన తోతాపురి టన్ను రూ.1.17 లక్షల ధర పలికింది. దీన్ని వేలంలో మైసూరుకు చెందిన రిజ్వాన్ కొన్నారు. పలమనేరు, వి.కోట, పెద్దఉప్పరపల్లె, బైరెడ్డిపల్లె, నాలుగు రోడ్ల ప్రాంతాల నుంచి మామిడి కాయలు ఇంకా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ నెల 20వ తేదీ వరకు మామిడి కొనుగొళ్లు జరగనున్నట్లు మండీ యజమానులు చెప్పారు.