ములకలచెరువు సీఐ, ఎస్‌ఐలపై చర్యలకు సిఫారసు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:49 AM
ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్‌ఐ రామకృష్ణలపై క్రమశిక్షణ చర్యలకు ఎస్పీ ధీరజ్‌కు కలెక్టర్ నిశాంత్ కుమార్ సిఫారసు చేశారు.
అన్నమయ్య, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్‌ఐ రామకృష్ణలపై క్రమశిక్షణ చర్యలకు ఎస్పీ ధీరజ్‌కు కలెక్టర్ నిశాంత్ కుమార్ సిఫారసు చేశారు. ములకలచెరువు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా వారిద్దరూ బాధ్యతారహితంగా, పక్షపాతంగా వ్యవహరించినట్లు క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్‌టీ), హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధవ్ కృష్ణారెడ్డి అందించిన నివేదిక మేరకు కలెక్టర్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. పలువురు అభ్యర్థులు, వారి ప్రతిపాదకులను కొంతమంది బెదిరిస్తూ, నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతున్నారన్న సమాచారంతో మాధవ్ కృష్ణారెడ్డి అక్కడకు చేరుకున్నారని, అభ్యర్థులకు భద్రత కల్పించాలని సీఐ, ఎస్‌ఐలకు పలుమార్లు సూచించినా పట్టించుకోకుండా పక్షపాతంగా వ్యవహరించారని తేలిందని కలెక్టర్ వివరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వారిద్దరినీ విధుల నుంచి తొలగించాలని సిఫారసు చేశారు. విచారణ జరిపి ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.