సీబీఐ అధికారుల పేరుతో రియల్టర్ కిడ్నా్‌ప
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:24 AM
రూ.26లక్షలు ఖాతాకు జమ ఆరుగురు అరె్‌స్ట.. పరారీలో కీలక నిందితుడు కారు సహా నకిలీ సామగ్రి సీజ్
మదనపల్లె క్రైం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సీబీఐ అధికారుల పేరుతో రియల్టర్‌ను కిడ్నాప్ చేసి, డబ్బు వసూలు చేసిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ మోహన్‌కుమార్ చెప్పారు. ఆదివారం స్థానిక వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మదనపల్లెలోని అగర్తవీధికి చెందిన షేక్.సాదిక్(49) రియల్టర్. తిరుపతికి చెందిన స్నేహితుడు వెంకట్రమణతో కలిసి గతంలో రియల్ వ్యాపారం చేశారు. వీరిపై కర్ణాటకలోని హోసూర్‌లో ఓ కేసు ఉండటంతో కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో వెంకట్రమణకు కొన్ని రోజుల కిందట వ్యాపారం ద్వారా చిత్తూరుకు చెందిన రాజా శ్రీనివాసులు అలియాస్ ఆర్.శ్రీనివాస్ పరిచయమయ్యాడు. ఇద్దరూ రియల్టర్లు కావడంతో చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, బెంగళూరు ప్రాంతాల్లో వ్యాపారం చేస్తుండేవారు. వీరికి కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన ఎంపీ సోహాన్‌భరత్, బెంగళూరుకు చెందిన కేఎన్ సార్థక్‌రాజ్, చేతన్‌రాజు, చిత్తూరుకు చెందిన పి.సురే్‌షసింగ్, వేణు గుణశేఖర్ స్నేహితులయ్యారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. కోర్టు వాయిదాకు వెళ్లి వచ్చే క్రమంలో వెంకట్రమణ, రాజా శ్రీనివాసులు కలసి సాదిక్‌పై కన్నేశారు. అతడిని కిడ్నాప్ చేస్తే తమకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయని భావించారు. సోహన్‌భరత్, సార్థక్‌రాజ్, చేతన్‌రాజు, సురే్‌షసింగ్, గుణశేఖర్‌లకు విషయం చెప్పి సీబీఐ అధికారుల అవతారమెత్తారు. నకిలీ గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్, హ్యాండ్‌కప్స్, 22పేజీలతో కూడిన అరెస్ట్ వారెంట్ పత్రం, రెండు కార్లను సిద్ధం చేసుకున్నారు.
కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా కిడ్నాప్
ఈనెల 10న సాదిక్, వెంకట్రమణ కోర్టు వాయిదాకు వెళ్లారు. అనంతరం సాదిక్ కారులో హోసూర్ నుంచి మదనపల్లెకు బయలుదేరాడు. పథకంలో భాగంగా పై ఆరుగురు కలసి రెండు కార్లలో సాదిక్‌ను ఫాలో అయ్యారు. స్థానిక మడికయ్యల శివాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ముస్లిం సమాధుల వద్ద కారును అడ్డగించారు. సూట్, సఫారీ డ్రెస్సులు ధరించి ఉన్న నిందితులు తాము సీబీఐ అధికారులమని చెప్పి నకిలీ గుర్తింపు కార్డులు, పిస్టల్, అరెస్ట్ వారెంట్‌తో అతన్ని బెదిరించారు. కేసు విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తున్నామంటూ కిడ్నాప్ చేసి, కర్ణాటకలోని తుమ్‌కూరు సమీపంలో ఉన్న ఫాంహౌ్‌సకు తీసుకెళ్లి నిర్బంధించారు. కేసుల నుంచి తప్పిస్తామని రూ.5కోట్లు డిమాండ్ చేశారు. చివరకు రూ.కోటికి బేరం కుదుర్చుకున్నారు. సాదిక్ తన స్నేహితులు, బంధువుల సాయంతో రూ.26లక్షలు కర్ణాటకకు చెందిన సీకే వెంచర్స్ ఖాతాకు జమ చేయించాడు. మిగతా రూ.74లక్షలు నగదు రూపంలో ఇవ్వాలని నిందితులు చెప్పడంతో సాదిక్ వెంటనే తన సోదరుడు ఇలియాజ్‌బాషాకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. దీంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మదనపల్లె-కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్టు సమీపంలోకి నగదు తీసుకుని వస్తే సాదిక్‌ను వదిలేస్తామని నిందితులు చెప్పడంతో పోలీసులు కాపు కాశారు. శనివారం సాదిక్‌ను తీసుకుని కారులో ఉండగా పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. వీరిలో వెంకట్రమణ కారులో వేగంగా వెళ్లిపోయి తప్పించుకున్నాడు. నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా గుట్టు రట్టయింది. డబ్బు కోసమే సాదిక్‌ను కిడ్నాప్ చేశామని నేరం అంగీకరించారు. పోలీసులు సాదిక్‌ను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను రిమాండుకు తరలించారు. కారు సహా నకిలీ సామగ్రి సీజ్ చేశారు. పోలీసులు వెంటనే సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు లెటర్ పంపి సీకే వెంచర్స్ ఖాతాలో ఉన్న రూ.26లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రహీముల్లా, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.