Share News

‘మురసు’ను ఎదుర్కొనేందుకు సిద్ధం

ABN , Publish Date - Nov 03 , 2026 | 01:27 AM

‘మురసు’ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని డీఆర్వో మోహన్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆయన జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందస్తు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై

‘మురసు’ను ఎదుర్కొనేందుకు సిద్ధం

- అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు డీఆర్వో ఆదేశం

- కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 08572-242733

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘మురసు’ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని డీఆర్వో మోహన్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆయన జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందస్తు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సమన్వయంతో పనిచేయాలి. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా చూడాలి. అత్యవసర మరమ్మతులకు సిద్ధంగా ఉండాలి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలితే తక్షణ చర్యలు చేపట్టేందుకు ఆయా శాఖలు సిద్ధంగా ఉండాలి. ఎక్కడైనా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. పునరావాస కేంద్రాల్లోని నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు అందించేందుకు నిల్వలను ఉంచుకోవాలి. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ.. పశునష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి’ అని డీఆర్వో మోహన్‌కుమార్‌ ఆదేశించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ 08572-242733 ఏర్పాటు చేశామన్నారు.

17 మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో 17 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. మండలాలవారీగా.. ఐరాలలో 19.2, పూతలపట్టులో 12.4, తవణంపల్లెలో 10.8, చిత్తూరు అర్బన్‌లో 8.6, పులిచెర్లలో 8.4, బంగారుపాళ్యంలో 8.2, నగరిలో 6.8, నిండ్రలో 6.2, రొంపిచర్లలో 5.6, విజయపురంలో 5.2, గంగవరంలో 3.6, గంగాధరనెల్లూరులో 3.4, పలమనేరులో 2.6, పెనుమూరులో 2.4, శ్రీరంగరాజపురంలో 2.4, బైరెడ్డిపల్లిలో 2.4, పాలసముద్రంలో 2.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Updated Date - Nov 03 , 2026 | 01:27 AM