Share News

పల్లె పోరుకు రెడీ

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:34 AM

రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలకు ప్రతిపాదనలు తొలివిడతలో చిత్తూరు.. మలి విడతలో కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లు ప్రతి ఓటరుకు రెండేసి ఓట్లు

పల్లె పోరుకు రెడీ

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పంచాయతీ పోరుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈసారి సర్పంచి, మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచికి ఒకటి... వార్డు సభ్యుడికి మరొకటి.. ఇలా రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. మొత్తం 600 గ్రామపంచాయతీలో 5906 వార్డులు ఉన్నాయి. వీటికి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రాథమిక చర్యలు చేపట్టింది.

తొలివిడత: చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 13 మండలాల్లో ఉన్న 337 పంచాయతీలు, 3094 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. మండలాల వారీగా బంగారుపాళ్యంలో 41 పంచాయతీలు (376 వార్డులు), చిత్తూరులో 17 (152), గంగాధరనెల్లూరులో 32 (310), గుడిపాలలో 27 (240), ఐరాలలో 28 (256), పెనుమూరులో 25 (226), పులిచెర్లలో 25 (222), పూతలపట్టులో 25 (228), రొంపిచర్లలో 11 (104), శ్రీరంగరాజపురంలో 23 (214), తవణంపల్లెలో 32 (210), వెదురుకుప్పంలో 25 (230), యాదమరిలో 26 పంచాయతీలకు (246 వార్డులు) ఎన్నికలు జరగనున్నాయి.

మలి విడత: కుప్పం రెవెన్యూ డివిజన్‌లోని 14 మండలాలు, 2812 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. మండలాల వారీగా గుడుపల్లెలో 18 పంచాయతీలు 192 వార్డులు, కుప్పంలో 29 (296), రామకుప్పంలో 23 (230), శాంతిపురంలో 23 పంచాయతీలకు (242వార్డులు) ఎన్నికలు జరుగుతాయి.

ఫ నగరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 102 పంచాయతీలు, 896 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. మండలాల వారీగా కార్వేటినగరంలో 22 (204), నగరిలో 21 (188), నిండ్రలో 21 (182), పాలసముద్రంలో 13 (116), విజయపురంలో 25 పంచాయతీలకు (206 వార్డులు) ఎన్నికలు ఉంటాయి.

పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో 90 పంచాయతీలు 956 వార్డులకు ఎన్నికలు నిర్వహించే పనిలో అధికారులు ఉన్నారు. మండలాల వారీగా బైరెడ్డిపల్లెలో 21 (216), గంగవరంలో 16 (178), పలమనేరులో 10 (106), వి.కోటలో 18 పంచాయతీల్లో (208 వార్డులు) ఎన్నికలు జరగబోతున్నాయి.

ముగిసిన అభ్యంతరాల స్వీకరణ

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ కేంద్రాల జాబితాపై బుధవారం అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆదివారం జాబితా ప్రచురించగా, సోమవారం నుంచి గురువారం వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. గురు, శుక్రవారాల్లో ఈ అభ్యంతరాలపై విచారణ జరిపి అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులు చేస్తారు. 29న కలెక్టర్‌కు పంపి ఆమోదం తీసుకుంటారు. 31న తుది జాబితా ప్రచురిస్తారు. జిల్లాలో గతంలో 1511 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇప్పుడు పెరిగిన ఓటర్లు.. రాజకీయపార్టీల అభ్యర్థన మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మరో 197 పోలింగ్‌ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలు పంపారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదించడంతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 1708కి చేరింది. గరిష్ఠంగా 650 మంది ఓటర్లు మించకుండా.. ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు చేపట్టారు. ఒకవేళ ఆ వార్డులో 650 మంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఉంటే రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేర వి.కోట మండలంలో 228 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం లోపల విద్యుత్‌ సదుపాయం కల్పించి లైట్లు, ఫ్యాన్లు ఉండేలా చూస్తున్నారు. వర్షం కురిస్తే బ్యాలెట్‌ బాక్స్‌లోకి నీరు చేరకుండా చర్యలు చేపట్టారు. పై కప్పునకు స్లాబు, కిటికీలు, తలుపులున్న భవనాలను పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నారు. వీలైనంతవరకు జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలను ఖరారు చేయగా.. ఇవి లేనిచోట్ల అంగన్వాడీ కేంద్రాలను గుర్తిస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పంచాయతీ పోరుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈసారి సర్పంచి, మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచికి ఒకటి... వార్డు సభ్యుడికి మరొకటి.. ఇలా రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. మొత్తం 600 గ్రామపంచాయతీలో 5906 వార్డులు ఉన్నాయి. వీటికి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రాథమిక చర్యలు చేపట్టింది.

తొలివిడత: చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 13 మండలాల్లో ఉన్న 337 పంచాయతీలు, 3094 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. మండలాల వారీగా బంగారుపాళ్యంలో 41 పంచాయతీలు (376 వార్డులు), చిత్తూరులో 17 (152), గంగాధరనెల్లూరులో 32 (310), గుడిపాలలో 27 (240), ఐరాలలో 28 (256), పెనుమూరులో 25 (226), పులిచెర్లలో 25 (222), పూతలపట్టులో 25 (228), రొంపిచర్లలో 11 (104), శ్రీరంగరాజపురంలో 23 (214), తవణంపల్లెలో 32 (210), వెదురుకుప్పంలో 25 (230), యాదమరిలో 26 పంచాయతీలకు (246 వార్డులు) ఎన్నికలు జరగనున్నాయి.

మలి విడత: కుప్పం రెవెన్యూ డివిజన్‌లోని 14 మండలాలు, 2812 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. మండలాల వారీగా గుడుపల్లెలో 18 పంచాయతీలు 192 వార్డులు, కుప్పంలో 29 (296), రామకుప్పంలో 23 (230), శాంతిపురంలో 23 పంచాయతీలకు (242వార్డులు) ఎన్నికలు జరుగుతాయి.

నగరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 102 పంచాయతీలు, 896 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. మండలాల వారీగా కార్వేటినగరంలో 22 (204), నగరిలో 21 (188), నిండ్రలో 21 (182), పాలసముద్రంలో 13 (116), విజయపురంలో 25 పంచాయతీలకు (206 వార్డులు) ఎన్నికలు ఉంటాయి.

పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో 90 పంచాయతీలు 956 వార్డులకు ఎన్నికలు నిర్వహించే పనిలో అధికారులు ఉన్నారు. మండలాల వారీగా బైరెడ్డిపల్లెలో 21 (216), గంగవరంలో 16 (178), పలమనేరులో 10 (106), వి.కోటలో 18 పంచాయతీల్లో (208 వార్డులు) ఎన్నికలు జరగబోతున్నాయి.

ముగిసిన అభ్యంతరాల స్వీకరణ

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ కేంద్రాల జాబితాపై బుధవారం అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆదివారం జాబితా ప్రచురించగా, సోమవారం నుంచి గురువారం వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. గురు, శుక్రవారాల్లో ఈ అభ్యంతరాలపై విచారణ జరిపి అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులు చేస్తారు. 29న కలెక్టర్‌కు పంపి ఆమోదం తీసుకుంటారు. 31న తుది జాబితా ప్రచురిస్తారు. జిల్లాలో గతంలో 1511 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇప్పుడు పెరిగిన ఓటర్లు.. రాజకీయపార్టీల అభ్యర్థన మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మరో 197 పోలింగ్‌ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలు పంపారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదించడంతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 1708కి చేరింది. గరిష్ఠంగా 650 మంది ఓటర్లు మించకుండా.. ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు చేపట్టారు. ఒకవేళ ఆ వార్డులో 650 మంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఉంటే రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేర వి.కోట మండలంలో 228 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం లోపల విద్యుత్‌ సదుపాయం కల్పించి లైట్లు, ఫ్యాన్లు ఉండేలా చూస్తున్నారు. వర్షం కురిస్తే బ్యాలెట్‌ బాక్స్‌లోకి నీరు చేరకుండా చర్యలు చేపట్టారు. పై కప్పునకు స్లాబు, కిటికీలు, తలుపులున్న భవనాలను పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నారు. వీలైనంతవరకు జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలను ఖరారు చేయగా.. ఇవి లేనిచోట్ల అంగన్వాడీ కేంద్రాలను గుర్తిస్తున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 01:37 AM