Share News

ఈ ఏడాది తొలి ప్రయోగానికి రెడీ

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:31 AM

ఇస్రో 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం 10.18 గంటలకు రాకెట్‌ నింగికి ఎగురనుంది. దీనికి 22.30 గంటల ముందుగా.. ఆదివారం 11.48 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. అదేసమయంలో రాకెట్‌లోని రెండు, నాలుగు దశల్లో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రకియను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.

ఈ ఏడాది తొలి ప్రయోగానికి రెడీ

పీఎ్‌సఎల్వీ-సీ 62 రాకెట్‌ ద్వారా నేడు ఈవోఎ్‌స-ఎన్‌1 ఉపగ్రహ ప్రయోగం

ఇస్రో 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం 10.18 గంటలకు రాకెట్‌ నింగికి ఎగురనుంది. దీనికి 22.30 గంటల ముందుగా.. ఆదివారం 11.48 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. అదేసమయంలో రాకెట్‌లోని రెండు, నాలుగు దశల్లో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రకియను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. కౌంట్‌డౌన్‌ 0కి చేరగానే నిప్పులు చిమ్ముతూ ఈవోఎ్‌స-ఎన్‌1 సహా మరో 15 బుల్లి ఉపగ్రహాలతో పీఎ్‌సఎల్వీ-సీ 62 రాకెట్‌ ఎగరనుంది. శనివారం రాత్రి షార్‌ చేరుకున్న ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పీఎ్‌సఎల్వీ ప్రయోగాల్లో ఇది 64వది. షార్‌ నుంచి 105వ ప్రయోగం.

ప్రయోగ సమయం: సోమవారం ఉదయం 10.18 గంటలు

రాకెట్‌: పీఎ్‌సఎల్వీ-సీ 62

ఉపగ్రహాలు: 16

ప్రధానమైంది: ఈవోఎ్‌స-ఎన్‌1 ఉపగ్రహం

ఉద్దేశం: పర్యావరణ పరిశోధన, వాతావరణ మార్పులపై అధ్యయనం

చిన్నవి: 15 ఉపగ్రహాలు. వీటిలో 8 విదేశాలకు చెందినవి.

- సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 12 , 2026 | 01:31 AM