Share News

కాణిపాకంలో శరవేగంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:18 AM

కాణిపాకంలో వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆస్థాన మండపంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వరదరాజస్వామి ఆలయం ఎదుట ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం అదనపు క్యూలైను నిర్మిస్తున్నారు.

కాణిపాకంలో శరవేగంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
కాణిపాకంలో ఏర్పాటు చేసిన స్వాగత ఆర్చి

నేటితో పూర్తి చేసేలా చర్యలు

కాణిపాకంలో వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆస్థాన మండపంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వరదరాజస్వామి ఆలయం ఎదుట ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం అదనపు క్యూలైను నిర్మిస్తున్నారు. గణేష్‌ ఇరుముళ్లు సమర్పించేందుకు దీక్షా విరమణ మండపాన్ని మణికంఠేశ్వరస్వామి ఆలయం ఎదుట నిర్మించారు. కాణిపాకం నుంచి అగరంపల్లె, ఐరాల రోడ్డు వైపు స్వాగతం ఆర్చీలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ దీపాలు, భారీ ఆర్చిల నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. శనివారం సాయంత్రానికి ఏర్పాట్లను పూర్తి చేస్తామని ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఆలయ ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు.

  • ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 12 , 2026 | 01:18 AM