పంటలపై కొనసాగుతున్న గజ దాడులు
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:26 AM
పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి రాయవారిపల్లె పంచాయతీలో పంటలపై దాడులు చేయడంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది.
కల్లూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి రాయవారిపల్లె పంచాయతీలో పంటలపై దాడులు చేయడంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతలవంక నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరిన 13 ఏనుగుల గుంపు రాయవారిపల్లె పంచాయతీ పాశంవారిపల్లె వద్దకు చేరుకున్నాయి. రైతులు భాస్కర్, గురప్పకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. అరటి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. పశుగ్రాసాన్ని తినేశాయి. అక్కడి నుంచి వచ్చిన దారిలోనే అడవిలోకి చేరుకున్నాయి. శనివారం పగలంతా అడవిలోని నెల్లిచెట్ల వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు ప్రజలు తెలిపారు.