Share News

మళ్లీదేవదాయశాఖ పరిధిలోకి రాజనాలబండ

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:48 AM

సత్యప్రమాణాలకు నిలయమైన రాజలనాలబండ ఆలయాన్ని మళ్లీ దేవదాయశాఖ స్వాధీనం చేసుకోనుంది. ఆశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాఽథ్‌ మంగళవారం ఈమేరకు తెలిపారు.

మళ్లీదేవదాయశాఖ పరిధిలోకి రాజనాలబండ

చౌడేపల్లె, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): సత్యప్రమాణాలకు నిలయమైన రాజలనాలబండ ఆలయాన్ని మళ్లీ దేవదాయశాఖ స్వాధీనం చేసుకోనుంది. ఆశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాఽథ్‌ మంగళవారం ఈమేరకు తెలిపారు. 2020లో ఈ ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోవాలని నాటి వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 2024లో కొండపై లక్ష్మీ నరసింహ ఆలయం, కొండ కింద రాజనాలబండపై ఆంజనేయస్వామి అనుబంధ ఆలయాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి నిత్య కైంకర్యాలు, పూజలు, సిబ్బంది జీతభత్యాలు, ఆలయ నిర్వహణ టీటీడీ అగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. ఆలయ జీర్ణోద్ధరణకు టీటీడీ రూ.3 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభమతాయని భావించారు. అయితే పనుల పర్యవేక్షణకు వచ్చిన టీటీడీ వేదపండితులు, స్థపతులు పరిశీలించి టీటీడీ ఆగమపండితులకు ఓ నివేదిక సమర్పించారు. ఈక్రమంలోనే ఆలయ పరిసరాల్లో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా సమాధులు ఉండటంతో టీటీడీ నుంచి తిరిగి దేవదాయశాఖకు ఆలయాన్ని స్వాధీనం చేయాలని సూచించారు. దీంతో బుధవారం నుంచి రాజనాలబండ ఆలయం తిరిగి దేవదాయశాఖకు బదిలీ కానుంది.

Updated Date - Aug 19 , 2026 | 01:48 AM