వర్షం.....కాస్త ఉపశమనం
ABN , Publish Date - May 27 , 2026 | 01:25 AM
తిరుపతి జిల్లాలో మంగళవారం పగలంతా సూర్యుడు సుర్రుమన్నాడు. తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. సాయంత్రం వాతావరణం మారింది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు మండలాల్లో కురిసింది.
తిరుపతి(కలెక్టరేట్), మే 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం పగలంతా సూర్యుడు సుర్రుమన్నాడు. తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. సాయంత్రం వాతావరణం మారింది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు మండలాల్లో కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతకు గురైన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. మంగళవారం బీఎన్‌కండ్రిగలో అత్యఽధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.పిచ్చాటూరులో 43.7, డీవీ సత్రంలో 43.5, తొట్టంబేడులో 43.3,సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్,అర్బన్, ఏర్పేడు మండలాల్లో 43.1, ఓజిలిలో
42.5, కేవీబీపురం, నాయుడుపేట, నాగలాపురం, నారాయణవనం, పుత్తూరు, సూళ్ళూరుపేట మండలాల్లో 42.2, రామచంద్రాపురంలో 42.1, చంద్రగిరి, బాలాయపల్లె. వడమాలపేట, వరదయ్యపాళెం మండలాల్లో 41.5, పెనగలూరులో 41, చిట్వేల్, కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో 40.6, డక్కిలిలో 40.1, పాకాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.