Share News

వర్షం.... ఉపశమనం

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:03 AM

తిరుపతి చల్లబడింది. గురువారం ఉదయం కాసేపు జోరు వర్షం కురవడంతో వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించింది.అయితే భారీ వర్షం కురుస్తుందనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైంది.అయితే వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

వర్షం.... ఉపశమనం
తిరుపతిలో శేషాచల కొండను కప్పేసిన శ్వేతమేఘాలు

తిరుపతి అర్బన్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి చల్లబడింది. గురువారం ఉదయం కాసేపు జోరు వర్షం కురవడంతో వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించింది.అయితే భారీ వర్షం కురుస్తుందనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైంది.అయితే వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.రైల్వేకోడూరు ప్రాంతంలో ఉన్న శేషాచలం, వెలుగొండ అడవుల్లో భిన్నవాతావరణం చోటుచేసుకుంది.ఊటీని తలపించేలా కొండను తాకేటట్లుగా తెల్లని మేఘాలు కనువిందు చేశాయి.శ్రీకాళహస్తిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయంనుంచి విడిచి విడిచి జల్లులు కురిశాయి.రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో తూర్పు ప్రాంత రైతుల్లో ఖరీ్‌పసాగుపై ఆశలు చిగురించాయి.పెనగలూరులోనూ సాయంత్రం అర్ధగంటసేపు వర్షం కురిసింది.

Updated Date - Oct 16 , 2026 | 02:03 AM