మదనపల్లెలో వర్షం
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:53 AM
మదనపల్లెలో బుధవారం సాయంత్రం చిరుజల్లులు పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చల్లబడింది.
మదనపల్లె, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మదనపల్లెలో బుధవారం సాయంత్రం చిరుజల్లులు పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం 4:30గంటల నుంచి అరగంట పాటు చిరుజల్లులు కురిశాయి. మొదటగా ఓ స్థాయిలో ఈదురు గాలులు వీయగా, తర్వాత తంపర్లతో మొదలైన వర్షం కొంతసేపటికి జల్లులుగా మారి రోడ్లపై నీరు ప్రవహించే స్థాయిలో కురిసింది. ఈదురు గాలులకు హోర్డింగ్‌లు, రోడ్లపై అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి పడగా, గాలులతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు నెలలుగా ఓ పక్క వేడి, మరోపక్క ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. మరోవైపు తీవ్రమైన ఎండలతో మెట్ట ప్రాంతాల్లో ఎండిపోయిన వ్యవసాయ బోర్లతో నీటి సరఫరా లేక ఎండుముఖం పడుతున్న టమోటా పంటకు కాస్త ప్రాణం పోసినట్లయింది.