Share News

20 మండలాల్లో వర్షం

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:04 AM

నైరుతి రుతుపవనాల ప్రభావ కారణంగా గడిచిన 24 గంటల్లో.. 20 మండలాల్లో ఓ మోస్తరు నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా రామకుప్పంలో 26.2 మి.మీ, అత్యల్పంగా యాదమరిలో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది.

20 మండలాల్లో వర్షం
చిత్తూరులో గురువారం పడుతున్న వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావ కారణంగా గడిచిన 24 గంటల్లో.. 20 మండలాల్లో ఓ మోస్తరు నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా రామకుప్పంలో 26.2 మి.మీ, అత్యల్పంగా యాదమరిలో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా.. పాలసముద్రంలో 19.2, శాంతిపురంలో 17.4, పులిచెర్లలో 12.0, బైరెడ్డిపల్లిలో 7.6, శ్రీరంగరాజపురంలో 7.4, వెదురుకుప్పం, గుడిపాల, నిండ్ర మండలాల్లో 7.2, చిత్తూరు అర్బన్‌లో 6.8, తవణంపల్లిలో 6.4, వి.కోటలో 4.4, గుడుపల్లెలో 4.2, కుప్పంలో 3.2, పెనుమూరు, పలమనేరు మండలాల్లో 2.0, బంగారుపాళ్యంలో 1.8, గంగవరం, గంగాధరనెల్లూరులలో 1.2 మి.మీ వర్షం కురిసింది. మూడు రోజులుగా జిల్లా అంతటా మేఘాలు కమ్ముకొని ముసురు ప్రభావం కనిపిస్తున్నది.

Updated Date - Nov 27 , 2026 | 02:04 AM