ఘాట్‌రోడ్డులో రేసింగ్ కార్!
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:43 AM
తిరుమల ఘాట్‌రోడ్డులో రేసింగ్ కారు ప్రయాణిస్తున్నట్టు ఎడిటింగ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఘాట్‌రోడ్డులో ఇలాంటి వాహనాల రాకపోకలు నిషేధం. పైగా ఎలాంటి రేసులకు ఆస్కారం ఉండదు. అయితే ఓ రేసింగ్ కారు అలిపిరి నుంచి ఘాట్‌రోడ్డులో చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టు ఎడిటింగ్ చేసిన వీడియోను ‘ఎఫ్1 తిరుమల ఘాట్‌రోడ్డు-అమృత్‌గౌడ్’ అనే టైటిల్‌తో అప్‌లోడ్ చేయగా, ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెజిటన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌రోడ్డులోని రేసింగ్ కారు ఎలా వచ్చింది, ఇది నిజమేనా.., అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియోపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
సోషల్ మీడియాలో వైరల్‌గా ఎడిటింగ్ వీడియో
తిరుమల, జనవరి18(ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్‌రోడ్డులో రేసింగ్ కారు ప్రయాణిస్తున్నట్టు ఎడిటింగ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఘాట్‌రోడ్డులో ఇలాంటి వాహనాల రాకపోకలు నిషేధం. పైగా ఎలాంటి రేసులకు ఆస్కారం ఉండదు. అయితే ఓ రేసింగ్ కారు అలిపిరి నుంచి ఘాట్‌రోడ్డులో చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టు ఎడిటింగ్ చేసిన వీడియోను ‘ఎఫ్1 తిరుమల ఘాట్‌రోడ్డు-అమృత్‌గౌడ్’ అనే టైటిల్‌తో అప్‌లోడ్ చేయగా, ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెజిటన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌రోడ్డులోని రేసింగ్ కారు ఎలా వచ్చింది, ఇది నిజమేనా.., అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియోపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.