మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:42 AM
మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలకు వేగంగా న్యాయం లభిస్తుందని హైకోర్టు, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి ఎన్.జయసూర్య అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్‌ఎ్‌సఏ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు శనివారం చట్టాలపై ఒక్కరోజు శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది.
హైకోర్టు జడ్జి ఎన్ జయసూర్య
చిత్తూరు లీగల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలకు వేగంగా న్యాయం లభిస్తుందని హైకోర్టు, చిత్తూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి ఎన్.జయసూర్య అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని డీఎల్‌ఎ్‌సఏ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు శనివారం చట్టాలపై ఒక్కరోజు శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మధ్యవర్తిత్వానికి 520 కేసులు రాగా 72 విజయవంతంగా పరిష్కారమయ్యాయన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార ఏడీఆర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 2023-మధ్యవర్తిత్వ చట్టం ఉపకరిస్తుందన్నారు. ఇది వివాదాలను తక్కువ ఖర్చుతో వేగంగా పరిష్కరిస్తుందన్నారు. కోర్టులపై పెరుగుతున్న భారాన్ని తగ్గించి వివాదాలను సామరస్యంగా పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 1940, 1996 ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ చట్టాల ముఖ్యాంశాలపై వివరించారు. న్యాయమూర్తులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక రిటైర్డ్ జిల్లా జడ్జి అన్వర్ బాషా, డాక్టర్ ఎస్. రజనితో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.