Share News

హెల్మెట్‌ పెట్టు.. బహుమతి పట్టు

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:29 AM

ద్విచక్ర వాహనాల్లో రక్షణ కవచంలా హెల్మెట్‌ పెట్టుకున్నారు. లక్కీడి్‌పలో బహుమతి పొందారు. ఇలా వారం, నెలకు సంబంధించి ఏడు విభాగాల్లో ఎంపికైన 84 మందికి మంగళవారం చిత్తూరులో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘సురక్షిత చిత్తూరు- మీ భద్రత, మా బాధ్యత’ కార్యక్రమంలో ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడారు. ‘ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే. జరిమానాల భయంతో కాకుండా తమ కుటుంబ సభ్యుల భద్రత, ప్రాణాల విలువలను గుర్తించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్‌ ధరించాలి. హెల్మెట్‌ ధరించిన వారిని ప్రోత్సహించేలా హెల్మెట్‌ పెట్టు.. బహుమతులు పట్టు కార్యక్రమాన్ని చేపట్టాం’ అని ఎస్పీ వివరించారు.

హెల్మెట్‌ పెట్టు.. బహుమతి పట్టు
మహిళకు బహుమతి ఇస్తున్న ఎమ్మెల్యే, పక్కన ఎస్పీ

చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి : ద్విచక్ర వాహనాల్లో రక్షణ కవచంలా హెల్మెట్‌ పెట్టుకున్నారు. లక్కీడి్‌పలో బహుమతి పొందారు. ఇలా వారం, నెలకు సంబంధించి ఏడు విభాగాల్లో ఎంపికైన 84 మందికి మంగళవారం చిత్తూరులో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘సురక్షిత చిత్తూరు- మీ భద్రత, మా బాధ్యత’ కార్యక్రమంలో ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడారు. ‘ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే. జరిమానాల భయంతో కాకుండా తమ కుటుంబ సభ్యుల భద్రత, ప్రాణాల విలువలను గుర్తించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్‌ ధరించాలి. హెల్మెట్‌ ధరించిన వారిని ప్రోత్సహించేలా హెల్మెట్‌ పెట్టు.. బహుమతులు పట్టు కార్యక్రమాన్ని చేపట్టాం’ అని ఎస్పీ వివరించారు. హెల్మెట్‌ వినియోగం, అతివేగ నియంత్రణ, మద్యం తాగి వాహనాలను నడపకుంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని నాన్‌ క్యాడర్‌ ఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. పోలీసుశాఖ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ అన్నారు. హెల్మెట్‌ పెట్టు- బహుమతులు పట్టు కార్యక్రమంలో ఎంపికైన వారికి, నెలవారీ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, ప్రోత్సాహక బహుమతులను అందించారు. దాతగా వ్యవహరించిన విజయం విద్యా సంస్థల చైర్మన్‌ తేజోమూర్తికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు గాంధీ విగ్రహ కూడలి నుంచి విజయం కళాశాల వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఆర్‌ ఏఎస్పీ దేవదాస్‌, డీఎస్పీ వెంకట నారాయణ, చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు, ఎస్‌బీ సీఐ మురళీ మోహన్‌, సీఐలు నెట్టికంఠయ్య, ప్రసాద్‌, రామచంద్ర, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ట్రాఫిక్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 01:29 AM