Share News

కలెక్టర్‌ దృష్టికి పులికాట్‌ సరిహద్దు సమస్య

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:04 AM

పులికాట్‌ సరస్సులో ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు సమస్యపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో చర్చించామని ఎమ్మెల్యే విజయశ్రీ చెప్పారు.

కలెక్టర్‌ దృష్టికి పులికాట్‌ సరిహద్దు సమస్య
ఎమ్మెల్యే విజయశ్రీని 50రూపాయల నోట్ల మాలతో సన్మానించిన టీడీపీ నాయకులు

ఎమ్మెల్యే విజయశ్రీ

తడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : పులికాట్‌ సరస్సులో ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు సమస్యపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో చర్చించామని ఎమ్మెల్యే విజయశ్రీ చెప్పారు. బుధవారం తడలో ఆమె మాట్లాడుతూ పులికాట్‌లో తమిళజాలర్ల బరితెగింపు విషయాన్ని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను కోరామన్నారు. అంతవరకు మత్స్యకారులు ఘర్షణకు దిగకుండా సంయమనం పాటించాలని కోరారు.టీడీపీ నాయకులు సెల్వం, పళణి, టీకె శ్రీనివాసన్‌, రవి, సుధాకర్‌, నీలకంఠం, రాజారెడ్డి, జీవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 01:45 AM