విద్యాశాఖ డ్రాఫ్టు సీనియారిటీ జాబితా ప్రచురణ
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:35 AM
జిల్లా విద్యాశాఖలోని అసిస్టెంట్ డైరెక్టర్లు, గ్రేడ్-2 హెచ్‌ఎం (ప్రభుత్వ/జెడ్పీ/ఎంపీపీ/మున్సిపాలిటీ/కార్పొరేషన్)లు, ఎంఈవోలు 1, 2, సీనియర్ డైట్ లెక్చరర్లకు సంబంధించి డ్రాఫ్టు సీనియారిటీ జాబితాను ప్రచురించినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చిత్తూరు సెంట్రల్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖలోని అసిస్టెంట్ డైరెక్టర్లు, గ్రేడ్-2 హెచ్‌ఎం (ప్రభుత్వ/జెడ్పీ/ఎంపీపీ/మున్సిపాలిటీ/కార్పొరేషన్)లు, ఎంఈవోలు 1, 2, సీనియర్ డైట్ లెక్చరర్లకు సంబంధించి డ్రాఫ్టు సీనియారిటీ జాబితాను ప్రచురించినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియారిటీ జాబితాలను డీఈవో, డీవైఈవో మెయిల్‌లో పొందుపర్చామన్నారు. వీటిలో అభ్యంతరాలు, సవరణలు, అభ్యర్థనలుంటే 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తగిన ధ్రువీకరణ పత్రాలతో డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. గడువు అనంతరం వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు.