తిరుపతి కేంద్రంగా డీసీసీబీ విస్తరణకు స్థలమివ్వండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:05 AM
డీసీబీసీ విస్తరణలో భాగంగా తిరుపతి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌ను చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థించారు. ఈ మేరకు కలెక్టర్‌కు లేఖ రాశారు. ‘వాణిజ్య, గ్రామీణ బ్యాంకులకు దీటుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సహకార బ్యాంకుల ద్వారా చేపడుతోంది. బ్యాంకుల పటిష్ఠం, అభివృద్ధి చర్యల్లో భాగంగా సింగిల్‌విండోల ద్వారా ఎన్నో సేవలు గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాల కోసం ప్రవేశపెట్టింది. సింగిల్‌విండోల లావాదేవీల కంప్యూటీకరణ ఇందులో భాగమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, కౌలు రైతులకు కేంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక రుణాల మంజూరులో డీసీసీబీ చొరవ చూపుతోంది. తిరుపతి జిల్లాలో డీసీసీబీ విస్తరణలో భాగంగా చిత్తూరు తరహాలో మొదటి అంతస్తులో ప్రాంతీయ కార్యాలయం, గ్రౌండ్‌ఫ్లోర్‌లో బ్యాంకుశాఖ ఏర్పాటుకు పాలకవర్గం నిర్ణయించింది. స్థల కేటాయింపు చేస్తే బ్యాంకు, నాబార్డు, ఆప్కాబ్ వంటి నిధులతో నిర్మాణాలు చేపడతాం’ అని ఆ లేఖలో అమాస పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా తిరుపతిలో మంగళం రోడ్డు, జ్యోతి టాకీస్ ప్రాంతంలో, ఏర్పేడు- వెంకటగిరి మధ్య పల్లం ప్రాంతాల్లో బ్యాంకు నూతన శాఖలు ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.
- తిరుపతి కలెక్టర్‌కు చైర్మన్ అభ్యర్థన
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): డీసీబీసీ విస్తరణలో భాగంగా తిరుపతి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌ను చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థించారు. ఈ మేరకు కలెక్టర్‌కు లేఖ రాశారు. ‘వాణిజ్య, గ్రామీణ బ్యాంకులకు దీటుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సహకార బ్యాంకుల ద్వారా చేపడుతోంది. బ్యాంకుల పటిష్ఠం, అభివృద్ధి చర్యల్లో భాగంగా సింగిల్‌విండోల ద్వారా ఎన్నో సేవలు గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాల కోసం ప్రవేశపెట్టింది. సింగిల్‌విండోల లావాదేవీల కంప్యూటీకరణ ఇందులో భాగమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, కౌలు రైతులకు కేంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక రుణాల మంజూరులో డీసీసీబీ చొరవ చూపుతోంది. తిరుపతి జిల్లాలో డీసీసీబీ విస్తరణలో భాగంగా చిత్తూరు తరహాలో మొదటి అంతస్తులో ప్రాంతీయ కార్యాలయం, గ్రౌండ్‌ఫ్లోర్‌లో బ్యాంకుశాఖ ఏర్పాటుకు పాలకవర్గం నిర్ణయించింది. స్థల కేటాయింపు చేస్తే బ్యాంకు, నాబార్డు, ఆప్కాబ్ వంటి నిధులతో నిర్మాణాలు చేపడతాం’ అని ఆ లేఖలో అమాస పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా తిరుపతిలో మంగళం రోడ్డు, జ్యోతి టాకీస్ ప్రాంతంలో, ఏర్పేడు- వెంకటగిరి మధ్య పల్లం ప్రాంతాల్లో బ్యాంకు నూతన శాఖలు ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.