ఏటీవోలు, ఎస్టీవోలుగా పదోన్నతులు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:36 AM
రాష్ట్ర ఖజానా లెక్కల శాఖలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పలువురు సీనియర్ అకౌంటెంట్లకు సబ్ ట్రెజరీ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ రాష్ట్ర డైరక్టర్ పద్మజ ఉత్తర్వులు జారీచేశారు.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానా లెక్కల శాఖలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పలువురు సీనియర్ అకౌంటెంట్లకు సబ్ ట్రెజరీ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ రాష్ట్ర డైరక్టర్ పద్మజ ఉత్తర్వులు జారీచేశారు. కర్నూలు జిల్లా ట్రెజరీలో పనిచేస్తున్న డి. రవికుమార్‌ను సత్యవేడు ఎస్టీవోగా, నంద్యాల డీటీవో ఆఫీసులో పనిచేస్తున్న ఎన్. కమలాకర్‌ను తిరుపతి డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయానికి, తిరుపతిలో పనిచేస్తున్న గోపాల్ రెడ్డిని చిత్తూరు డీటీవో కార్యాలయానికి, కదిరిలో పనిచేస్తున్న పి.విశ్వనాథ్‌ను చిత్తూరు డీటీవో కార్యాలయానికి ఎస్టీవోగా పదోన్నతి కల్పించి పోస్టింగ్స్ ఇచ్చారు. మల్టీజోన్-2 పరిధిలో ఎస్టీవోలుగా పనిచేస్తున్న ఇరువురికి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించారు. సత్యవేడులో ఎస్టీవోగా పనిచేస్తున్న కె. ఈశ్వరయ్యను కడప జిల్లా డిస్ట్రిక్ట్ ట్రెజరీ కార్యాలయానికి, కడప డిస్ట్రిక్ట్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న వి.వి. రమణారెడ్డిని అన్నమయ్య జిల్లా డీటీవో కార్యాలయానికి బదిలీ చేసింది.
ఫ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోట్ చేయబడ్డ షేక్ మొహమ్మద్ హుస్సేన్‌ను కుప్పం ఆర్డీవోగా నియమించారు. చిత్తూరు జిల్లా ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్. కరుణకుమారిని ఉయ్యూరు ఆర్డీవోగా బదిలీ చేస్తూ ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించి బి. పుల్లారెడ్డిని ఎఫ్‌ఎ్‌సవోగా ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన పి. మధుసూదన్ రావును చిత్తూరు కలెక్టరేట్ డీపీఎం డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా నియమించింది. కె. నాగార్జునను తిరుపతి కలెక్టరేట్ ప్రొటోకాల్-2 ఎస్డీసీగా, పి. తేజస్వీరావును తిరుపతి కలెక్టరేట్ లీగల్ సెల్ ఎస్డీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.