ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:44 AM
వినియోగదారులు ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించేలా సదరన్ డిస్కం ప్రాధాన్యమిస్తోంది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్కం ప్రకటించింది.
జోరందుకున్నాక రెవెన్యూ కౌంటర్ల మూత
పారదర్శకత కోసమేనన్న సదరన్ డిస్కం
తిరుపతి(ఆటోనగర్), జూలై 11 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులు ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించేలా సదరన్ డిస్కం ప్రాధాన్యమిస్తోంది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిస్కం ప్రకటించింది. డిస్కం పరిధిలోని తిరుపతి, కడప, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 61.32 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరి నుంచి నెలకు విద్యుత్ చార్జీల బిల్లుల రూపంలో సుమారు రూ.520 కోట్లు వసూలు చేస్తున్నారు. బిల్లుల వసూలు విధానంలో పారదర్శకత కొరవడిందన్న విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల కిందట నుంచే వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే ప్రక్రియకు సంస్థ శ్రీకారం చుట్టింది. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, డైనమిక్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ గవర్నె్‌స(మనమిత్ర), నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రిడెట్ కార్డుల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ప్రస్తుతం 49 శాతం మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఈ శాతం మరింత పెరిగితే విద్యుత్ బిల్లులు వసూలు చేసే రెవెన్యూ కౌంటర్లను మూత వేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.