Share News

టమోటా రైతుకు ధరా ఘాతం

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:11 AM

30 కిలోల బాక్సు రూ.50 నుంచి రూ.100

టమోటా రైతుకు ధరా ఘాతం
పెద్దమండ్యం సమీపంలో పొలంలో వదిలేసిన టమోటాలు

పెద్దమండ్యం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): టమోటాకు కనీస ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు 30 కిలోల బాక్స్‌ ధర నాణ్యతను బట్టి రూ.100 నుంచి రూ.300 వరకు పలికింది. నెల రోజులుగా మరింత దిగజారింది. మదనపల్లె, ములకలచెరువు, కలకడ మార్కెట్లలో నాణ్యతను బట్టి 30 కిలోల బాక్స్‌ ధర రూ.50 నుంచి రూ.100కు పడిపోయింది. ఈ క్రమంలో కొందరు రైతులు పంటను తోటలోనే వదిలేస్తున్నారు. మరికొందరు జ్యూస్‌ కోసం తోటల వద్దే 15 కిలోల బాక్స్‌ను రూ.30కు అమ్ముకుంటున్నారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, అది కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో దిగుబడి పెరిగి ఎగుమతులు తగ్గాయని, అందుకే ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 01:11 AM