అక్రమ తరలింపును అడ్డుకోండి
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:06 AM
గ్రావెల్, ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.పిచ్చాటూరు మండలంలో గురువారం పర్యటించిన ఆయన కీళపూడిలో భూముల రీ సర్వే, సర్ ప్రక్రియ కార్యక్రమాలను ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగార్జున్‌లతో కలసి పరిశీలించారు.
పిచ్చాటూరు, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి):గ్రావెల్, ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు.పిచ్చాటూరు మండలంలో గురువారం పర్యటించిన ఆయన కీళపూడిలో భూముల రీ సర్వే, సర్ ప్రక్రియ కార్యక్రమాలను ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగార్జున్‌లతో కలసి పరిశీలించారు. అనంతరం తిరుపతికి వస్తుండగా నిండ్ర క్రాస్ వద్ద భారీ టిప్పరు రోడ్డుపై వుండడం చూసి కలెక్టర్ కారు దిగారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సీఐ భాస్కర్‌తో మాట్లాడారు.ఈ టిప్పరు ఎక్కడికి వెళుతోందని ఆరా తీయగా చెన్నై వెళుతోందని సీఐ సమాధానం ఇచ్చారు.ఈ మార్గం గుండా ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం ఉందంటూ సీఐని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ మార్గం ద్వారా వెళ్ళడం వాస్తవమే కానీ అయితే అవి పర్మిషన్‌తో వెళుతున్నాయని సీఐ సమాధానం ఇచ్చారు. వెంటనే మైనింగ్ అధికారులకు ఫోన్ చేసిన కలెక్టర్ పిచ్చాటూరు పరిసరాల నుంచి ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అక్కడే ఉన్న స్థానిక అధికారులు కూడా అక్రమ తరలింపుపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.