Share News

‘పల్లె పోరు’కు ఏర్పాట్లు షురూ

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:07 AM

135 క్లస్టర్లుగా.. 617 గ్రామపంచాయతీలు 1400 మంది అధికారుల నియామకం క్లస్టర్లలోనే నామినేషన్ల స్వీకరణ

‘పల్లె పోరు’కు ఏర్పాట్లు షురూ

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం అధికారపూర్వకంగా ప్రకటన విడుదల కానుంది. 15 నుంచి 17 తేదీవరకు తొలి విడత, ఆ తరువాత మరో రెండు విడతలు ఎన్నికలు జరుగుతాయి. ఇదివరకే ప్రకటించిన నిర్ణీత తేదీలలో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 3-4 పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా చేసి అక్కడ ఆయా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలు పార్టీలరహితమైనా.. తమ మద్దతుదారులే పంచాయతీ పాలకవర్గాల్లో కొలువు తీరేలా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ వేడెక్కింది. ఆయా స్థానాల్లో ఎవరిని నిలిపితే బాగుంటుందన్న సమీకరణలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా ఉన్న 617 గ్రామపంచాయతీలను 135 క్లస్టర్లుగా విభజించారు. స్టేజ్‌ -1 ఆర్వోలుగా 270 మంది, రిజర్వులో 110 మంది, స్టేజి -2 ప్రిసైడింగ్‌ అధికారులుగా 700 మంది, ఇంకా రూట్‌ ఆఫీసర్లు 110 మంది, జోనల్‌ ఆఫీసర్లుగా 215 మంది వెరసి 1400 మంది అధికారులను నియమించారు.

మూడు విడతల్లో ఎన్నికలు ఇలా..

మొదటి విడత: 9 మండలాలు, 182 పంచాయతీలు

కుప్పం రెవెన్యూ డివిజన్‌: కుప్పం మండలం (29 పంచాయతీలు), గుడుపల్లె (18), రామకుప్పం (22), శాంతిపురం (23).

పలమనేరు డివిజన్‌: పలమనేరు (10), బైరెడ్డిపల్లె (21), గంగవరం (16), పెద్దపంజాణి(25), వి.కోట (18)

రెండో విడత: 9 మండలాలు, 229 పంచాయతీలు

చిత్తూరు డివిజన్‌: చిత్తూరు రూరల్‌ మండలం (17 పంచాయతీలు), గుడిపాల (27), బంగారుపాళ్యం (41), ఐరాల (28), పులిచెర్ల (23), పూతలపట్టు (25), రొంపిచెర్ల (11), తవణంపల్లె (32), యాదమరి (26పంచాయతీలు)

మూడో విడత: 9 మండలాలు, 206 పంచాయతీలు

నగరి డివిజన్‌: కార్వేటినగరం మండలం (22 పంచాయతీలు), నగరి (21), నిండ్ర (21), పాలసముద్రం (13), విజయపురం (25).

చిత్తూరు డివిజన్‌: గంగాధరనెల్లూరు మండలం (32 పంచాయతీలు), పెనుమూరు (23), శ్రీరంగరాజపురం (23), వెదురుకుప్పం (25)

Updated Date - Nov 12 , 2026 | 01:07 AM