Share News

పోలింగ్‌ ప్రశాంతం: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:17 AM

పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. గురువారం ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి రేణిగుంట మండలం వెంకటాపురం, కరకంబాడి పంచాయతీల్లో జరుగుతున్న ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేశారు.

  పోలింగ్‌ ప్రశాంతం: కలెక్టర్‌
కరకంబాడిలో ఎస్పీతో కలిసి కౌంటింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

రేణిగుంట నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. గురువారం ఎస్పీ సుబ్బరాయుడితో కలిసి రేణిగుంట మండలం వెంకటాపురం, కరకంబాడి పంచాయతీల్లో జరుగుతున్న ఎన్నికల కేంద్రాలను తనిఖీ చేశారు. సాయంత్రం రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలనూ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఒకటి రెండు చోట్ల స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నా పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఉందని, సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌, ఇతర ప్రాంతాల్లో వీడియో గ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీ అయిన దేవులపల్లెలో కూడా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ సాగిందన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 02:17 AM