ఘర్షణ కేసులపై పోలీసుల ఫోకస్
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:14 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా జిల్లాలో జరిగిన ఘటనలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పుంగనూరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం విదితమే. వైసీపీ వాళ్లు టీడీపీ వర్గీయులపై దాడులకు తెగబడటంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.
- నిందితుల కోసం వెదుకులాట
అన్నమయ్య, అక్టోబర్ 24(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా జిల్లాలో జరిగిన ఘటనలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పుంగనూరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం విదితమే. వైసీపీ వాళ్లు టీడీపీ వర్గీయులపై దాడులకు తెగబడటంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.
కేసులు నమోదు ఇలా..
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్బంగా రాజంపేట ఎంపీ మిథున్‌రె డ్డి కాన్వాయ్‌తో టీడీపీ శ్రేణులను ఢీకొనడంతో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మదనపల్లె డీఎస్పీ ప్రసాద్, టీడీపీ కార్యకర్తలు సుహేల్‌బాషా, మధుసూదన్‌రాయల్, మోహన్‌నాయుడు ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు నాలుగు సెక్షన్ల కింద సుమారు 200 మందిపై కేసులు నమోదు చేశారు.
ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా పుంగనూరు కొత్తఇండ్లలో వైసీపీ శ్రేణులు 300 మందికి పైగా వచ్చి రాళ్లు, కర్రలు, సీసాలతో దాడులు చేసి ముగ్గురు టీడీపీ కార్యకర్తలను గాయపరిచారు. టీడీపీ కార్యకర్త నారాయణస్వామి ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు 177 మందిపై కేసు నమోదు చేశారు.
చౌడేపల్లె మండలం పెద్ద కొండామరిలో వైసీపీ మండలాధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో 27మంది టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేశారు.
సదుం ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ నేతలు టీడీపీ వాళ్లపై దాడి చేసి గాయపరిచారు. టీడీపీ నాయకుడు పవన్‌కుమార్‌రెడ్డికి చెందిన కారుకు నిప్పు పెట్టారు. పవన్‌కుమార్‌రెడ్డి, నరసింహులు, సదుం పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు 25 మందితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
సోమల మండలం నెల్లిమంద పంచాయతీ చింతలవారిపల్లెలో వైసీపీ అభ్యర్థి బాలసుబ్రమణ్యం నామినేషన్ వేశాడనే కారణంతో అతని ఇల్లు, వాహనాన్ని ఽధ్వంసం చేశారు. దీనిపై సోమల పోలీసులు కేసు నమోదు చేశారు.
పీటీఎం మండలంలో జరిగిన దాడులకు సంబంధించి 38 మంది వైసీపీ, ఐదుగురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
తంబళ్లపల్లెలో గొడవకు సంబంధించి 10 మంది వైసీపీ, 10 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.
తంబళ్లపల్లె మండలంలో జనసేన కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, రాళ్లు, పెట్రోలు బాంబులతో దాడులు, ట్రాక్టర్‌కు నిప్పు పెట్టడం, నామినేషన్లకు అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలకు సంబంధించి 14 మందికి పైగా కేసులు నమోదు చేశారు.
నిందితుల కోసం గాలింపు
జిల్లాలో జరిగిన ఘర్షణలకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెదుకుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వాళ్ల కోసం గాలిస్తున్నారు. కేసుల్లో చిక్కుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఊర్లు వదిలినట్లు తెలుస్తోంది.