Share News

స్వచ్ఛ ప్రతిజ్ఞ

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:47 AM

‘నేను.. నా పరిసరాల పరిశుభ్రతకోసం ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తూ, స్వచ్ఛత కార్యక్రమాలలో శ్రమదానం చేస్తాను. ఇకపై నాతోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ, భావితరాలకు ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అందించేందుకు కట్టుబడి ఉంటాను’ అంటూ శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగాల ఉద్యోగులతో చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రతిజ్ఞ చేయించారు.

స్వచ్ఛ ప్రతిజ్ఞ

‘నేను.. నా పరిసరాల పరిశుభ్రతకోసం ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తూ, స్వచ్ఛత కార్యక్రమాలలో శ్రమదానం చేస్తాను. ఇకపై నాతోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ, భావితరాలకు ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అందించేందుకు కట్టుబడి ఉంటాను’ అంటూ శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగాల ఉద్యోగులతో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రతినెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని, ఈ వారం జలహారతి- జలధార థీమ్‌తో చేపట్టామన్నారు. వందరోజుల కార్యాచరణ ద్వారా భూగర్భ జలాలు పెంచడంతో పాటు స్వచ్ఛమైన వాతావరణం సాధిద్దామన్నారు. కలెక్టరేట్‌లో ఉద్యోగులు పచ్చదనం పరిశుభ్రత నిర్వహించారు. డీఆర్వో మోహన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 19 , 2026 | 01:47 AM