అందాలకొండపై ఆహ్లాద వాతావరణం
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:12 AM
ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో పర్యాటకులకు సాంత్వన కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడున్న ఫారెస్ట్ క్యాంపస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అటవీ ప్రాంగణం అనుభూతి అనంతం
ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునే అంశాలెన్నో...!
బి.కొత్తకోట, జూన్26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో పర్యాటకులకు సాంత్వన కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడున్న ఫారెస్ట్ క్యాంపస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రూ.25 చెల్లించి ఈ క్యాంపస్‌లో ప్రవేశించగానే పిల్లల పార్కు, మినీ జూ పర్యాటకులను ఆహ్వానిస్తాయి. మొసళ్ల పార్కు, జింకలు, కుందేళ్లు, నెమళ్లు, బాతులతోపాటు పలు వింత ప్రాణులను వీక్షించవచ్చు. పిల్లల ఆటలకు పలు నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రదేశాలను కలుపుతూ దిగువన వాకింగ్ ట్రాక్, పైభాగంలో వుడెన్‌బ్రిడ్జి(కెనాపీవాక్) నిర్మాణం అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్నా..ఇంటి నుంచి తెచ్చుకున్నా కుటుంబ సమేతంగా ప్రశాంతంగా తినొచ్చు. 1992లో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రారంభించిన ఎన్విరాన్మెంటల్ కాంప్లెక్స్‌లో నూతన వధూవరులు, ప్రేమజంటలు, బర్త్‌డే బేబీలు ఫొటోషూట్‌కు సుందరమైన లొకేషన్లు ఉన్నాయి. మానస సరోవరంలో బోటింగ్ విహారం మధురానుభూతిని కలిగిస్తుంది. ఆ ప్రాంత విశిష్టతను వివరించే గ్రంథాలయం అందుబాటులో ఉంది. రూ.15 లక్షలతో ఓపెన్ ఆడిటోరియం నిర్మాణ దశలో ఉంది.