పేటమిట్టకు ‘ఉత్తమ’ పంచాయతీ అవార్డు
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:38 AM
పూతలపట్టు మండలం తలుపులనేనివారిపల్లె (పేటమిట్ట) పంచాయతీ సర్పంచి గల్లా రాధాకృష్ణమ నాయుడు దంపతులు ఢిల్లీలో కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ భాగల్ చేతులమీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు.
ఢిల్లీలో అందుకున్న సర్పంచి
పూతలపట్టు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పూతలపట్టు మండలం తలుపులనేనివారిపల్లె (పేటమిట్ట) పంచాయతీ సర్పంచి గల్లా రాధాకృష్ణమ నాయుడు దంపతులు ఢిల్లీలో కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ భాగల్ చేతులమీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో సోమవారం సర్పంచ్ గల్లా రాధాకృష్ణ, ఆయన సతీమణి నిర్మల దంపతులు ఈ అవార్డును అందుకున్నారు. పంచాయతీలో తాగునీటి సరఫరా కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రాజన్న ట్రస్టు ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పశువైద్యశాల, 250 ఎకరాల్లో పెమ్ముగుట్టను అభివృద్ధి చేశారు. ఏటా వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయడంతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు, ఎల్‌ఈడీ వీధి లైట్లు, గ్రామంలో గుడి, రాజన్న ఆరోగ్య కేంద్రంతో పాటు అవసరమైన మౌలిక అవసరాలను సమకూర్చారు. దీంతో పేటమిట్టను ఉత్తమ పంచాయతీగా కలెక్టర్ సుమిత్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు. దీంతో ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు.