మహిళా విశ్వవిద్యాలయంలో 103 పోస్టుల భర్తీకి అనుమతి
ABN , Publish Date - May 08 , 2026 | 01:41 AM
తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బోధనా విభాగానికి సంబంధించి ఖాళీగా వున్న 103 పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా వున్న రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇదే వర్శిటీలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయడానికి 2023లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించాల్సిందిగా కోరుతూ 2026 ఏప్రిల్ 10న జరిగిన వర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఈ పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అనుమతించాల్సిందిగా కూడా కౌన్సిల్ కోరింది.
కలికిరి, మే 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బోధనా విభాగానికి సంబంధించి ఖాళీగా వున్న 103 పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా వున్న రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇదే వర్శిటీలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయడానికి 2023లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించాల్సిందిగా కోరుతూ 2026 ఏప్రిల్ 10న జరిగిన వర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ఈ పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అనుమతించాల్సిందిగా కూడా కౌన్సిల్ కోరింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఖాళీగా వున్న పోస్టుల భర్తీ కోసం 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా వర్శిటీ రిజిస్ట్రార్‌ను కోరుతూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.