Share News

ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 02:08 AM

సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండగా వేడిగాలులు తోడవుతున్నాయి. దీంతో జనసంచారం లేక వీధులు,బజార్లు బోసిపోతున్నాయి.

 ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండగా వేడిగాలులు తోడవుతున్నాయి. దీంతో జనసంచారం లేక వీధులు,బజార్లు బోసిపోతున్నాయి. వీధివ్యాపారులు, వ్యవసాయ కూలీలు ఎండవేడిమికి తల్లడిల్లిపోతున్నారు. బుధవారం దాదాపు పది మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అత్యధికంగా వరదయ్యపాళెంలో 42.2డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా తొట్టంబేడులో 41.4, పెనగలూరులో 41.2, బాలయపల్లె, డక్కిలి మండలాల్లో 40.9, డీవీ సత్రం,నాయుడుపేట మండలాల్లో 40.3, శ్రీకాళహస్తిలో 40.2, రేణిగుంటలో 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి

నాయుడుపేట, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : నాయుడుపేట పట్టణం జువ్వలపాళేనికి చెందిన వృద్ధురాలు నెలవల శిరోమణి (73) బుధవారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న శిరోమణి బుధవారం ఎండ వేడిమికి తట్టుకోలేక మృతి చెందినట్లు తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 02:08 AM