Share News

వడగాడ్పులతో జనం విలవిల

ABN , Publish Date - May 25 , 2026 | 01:03 AM

వాయువ్య భారతం నుంచి రాష్ట్రం మీదుగా వడగాడ్పులు వీస్తుండటంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై జనం విలవిల్లాడిపోతున్నారు.

వడగాడ్పులతో జనం విలవిల

- వెంకటగిరిలో 43.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

తిరుపతి(కలెక్టరేట్‌), మే 24 (ఆంధ్రజ్యోతి): వాయువ్య భారతం నుంచి రాష్ట్రం మీదుగా వడగాడ్పులు వీస్తుండటంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై జనం విలవిల్లాడిపోతున్నారు. ఆదివారం వెంకటగిరిలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మండలాల వారీగా.. సత్యవేడు, తడలో 42.9, డీవీసత్రం, నారాయణవనంలో 42.7, తిరుపతి రూరల్‌, అర్బన్‌లో 42.5, బీఎన్‌కండ్రిగ, తొట్టంబేడులో 42.2, నాయుడుపేట, రేణిగుంట, ఏర్పేడులో 42, ఓజిలిలో 41.9, శ్రీకాళహస్తిలో 41.6, చంద్రగిరి, డక్కిలి, రామచంద్రాపురంలో 41.4, పెళ్లకూరులో 41.3, కేవీబీపురం, సూళ్లూరుపేటలో 41.2, నాగలాపురం, వరదయ్యపాళెం, వడమాలపేటలో 41.1, పిచ్చాటూరులో 41, బాలాయపల్లిలో 40.8, పుల్లంపేటలో 40.4, చిట్టమూరులో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 25 , 2026 | 01:03 AM