Share News

శాస్త్రోక్తంగా శాంతి అభిషేకాలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:07 AM

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం ఉత్సవమూర్తులకు శాంతి అభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ శాంతి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం.

శాస్త్రోక్తంగా శాంతి అభిషేకాలు

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం ఉత్సవమూర్తులకు శాంతి అభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ శాంతి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా సోమవారం ముక్కంటి ఆలయంలోని అలంకార మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపనతో సంకల్ప పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలను నిర్వహించారు. ఉత్సవాల్లో తెలియక పొరపాట్లు జరిగి ఉంటే ప్రాయశ్చిత్తం కోసం ఉత్సవమూర్తులకు హోమం ద్వారా శాంతి పూజలు చేశారు.అనంతరం ధూప, దీప, నైవేద్య, హారతులు సమర్పించారు. ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

-శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 24 , 2026 | 01:07 AM