ముగ్గురు గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:29 AM
తిరుపతి జిల్లాలో గంజాయి రవాణా చేస్తూ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిపై పీడీ యాక్ట్ అమలుకు అడ్వైజరీ బోర్డు ఆమోదించింది.
తిరుపతి(నేరవిభాగం), మార్చి 18(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో గంజాయి రవాణా చేస్తూ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిపై పీడీ యాక్ట్ అమలుకు అడ్వైజరీ బోర్డు ఆమోదించింది. తిరుపతి రూరల్ మండలం పద్మావతి పురానికి చెందిన సాదు హరి (28),పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్‌కు చెందిన బాబు బక్కిరాజు (43),ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామానికి చెందిన కొండా మునిభరణి (20) గంజాయి కొనుగోలు, నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న కారణంగా పోలీసులు వీరిని అరె్‌స్టచేసి జైలుకు పంపించారు. విశ్రాంత జస్టిస్ నీలం సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన అడ్వైజరీ బోర్డు వీరి ముగ్గురిపై పీడీ యాక్ట్‌ను అమలు చేయాలని నిర్ణయించగా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.