Share News

విలేకరి హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్‌

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:08 AM

వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ వారణాసి జగన్మోహన్‌రెడ్డి హత్య కేసు నిందితులు తమీమ్‌, సుభాన్‌పై పీడీ యాక్టు నమోదు చేశారు.

విలేకరి హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్‌

చిత్తూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ వారణాసి జగన్మోహన్‌రెడ్డి హత్య కేసు నిందితులు తమీమ్‌, సుభాన్‌పై పీడీ యాక్టు నమోదు చేశారు. ఎస్పీ తుషార్‌డూడీ ఆదేశాలతో కేసు విచారణాధికారి, వి.కోట సీఐ సోమశేఖర్‌రెడ్డి సిఫార్సు మేరకు డీఎస్పీ ప్రభాకర్‌ పర్యవేక్షణలో పీడీ యాక్ట్‌ ఫైల్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వద్దకు వచ్చింది. ఆయన అప్రూవ్‌ చేసి చీఫ్‌ సెక్రటరీకు పంపించారు. అక్కడి నుంచి ఇద్దరు మీద పీడీ యాక్ట్‌ నమోదైనట్లు ప్రత్యేక జీవో విడుదల అవుతుంది. దీంతో ఇద్దరు నిందితులు కొన్ని సంవత్సరాల పాటు జైళ్లోనే ఉండాల్సి వస్తుంది. అలాగే చిత్తూరులో డ్రగ్స్‌ సప్లయి చేస్తున్న ఓ క్రిమినల్‌పై కూడా పీడీ యాక్ట్‌ నమోదు చేసే అంశాన్ని కలెక్టర్‌, ఎస్పీ పరిశీలిస్తున్నారు. డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టేందుకు 10 మంది మీద పీడీ యాక్ట్‌ నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Aug 04 , 2026 | 01:08 AM