Share News

26 నుంచి కాణిపాకంలో పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:00 AM

కాణిపాకంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిశోర్‌ తెలిపారు.

26 నుంచి కాణిపాకంలో పవిత్రోత్సవాలు

ఐరాల(కాణిపాకం), నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిశోర్‌ తెలిపారు. తొలిరోజు సాయంత్రం 5 గంటలకు అనుజ్ఞ, విఘ్నేశ్వర పూజ, వాస్తు శాంతి, మృత్సంగ్రహణ, రక్షా బంధనం, స్తండిల మండలేశ్వర పూజ, గంధ పవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, పూర్ణాహుతి, దీపారాధన ఉంటుంది. 27న ఉదయం 9 గంటల నుంచి విశేష సంధి, రెండవ కాల పూజ, స్తండిల మండలేశ్వరపూజ, హోమం, వ్రత సమర్పణ, రెండవ కాల పవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, పూర్ణాహుతి, దీపారాధన, సాయ్రంత్రం 5 గంటల నుంచి విశేష సంధి, మూడవ కాల పూజ, స్తండిల మండలేశ్వర పూజ, హోమం, వ్రత సమర్పణ, మహాపవిత్ర సమర్పణ, విశేషద్రవ్యాహుతి, పూర్ణాహుతి, దీపారాధన. 28న ఉదయం 8 గంటల నుంచి అవభృధ, యోగపూజ, స్తండిల మండలేశ్వర పూజ, హోమం పవిత్రం సమర్పణ, మహా పవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, మహాపూర్ణాహుతి, మహా దీపారాధన, యాత్రాదానం, స్తపన తిరుమంజనం, కుంభ చండీ యాగం, దీపారాధన నిర్వహించనున్నారు.

Updated Date - Nov 24 , 2026 | 01:00 AM