Share News

పవనన్న పచ్చతోరణం

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:19 AM

రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపు మేరకు అడవుల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు టీ రాజకీయం పేరుతో మిత్ర బృందం ముందుకొచ్చింది.

పవనన్న పచ్చతోరణం
చీకిలబైలు వద్ద అటవీశాఖ అధికారులతో కలసి మొక్కలు నాటుతున్న టీ రాజకీయం బృందం సభ్యులు

- 3వేల మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం అభిమానులు

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపు మేరకు అడవుల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు టీ రాజకీయం పేరుతో మిత్ర బృందం ముందుకొచ్చింది. మదనపల్లె మండలంలోని చీకిలబైలు అటవీప్రాంతంలో సబ్‌ డీఎ్‌ఫవో శ్రీనివాసులు అనుమతితో 3వేల మొక్కలు నాటడానికి టీ రాజకీయం బృందంలో ముఖ్యుడు లండన్‌లో ఉద్యోగం చేస్తున్న కిరణ్‌ అడుగులు వేశారు. శుక్రవారం చీకిలబైలు వద్ద అటవీశాఖ అధికారులతో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన రీజినల్‌ కోఆర్డినేటర్‌ దారం అనిత, శరణ్‌, అటవీశాఖ అధికారులు సైదులు, శివకుమార్‌, శివరంజని, ఉమాదేవి, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 01:19 AM